ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్‌ను మంగళవారం పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. తనను లైంగికంగా వేధించాడంటూ కుమారి అనే రేడియో జాకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి గజల్ గాయకుడు శ్రీనివాస్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గజల్ శ్రీనివాస్‌కు ఈ నెల 12 వరకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో, శ్రీనివాస్‌ను చంచల్ గూడ జైలుకు తరలించారు.
అయితే, ఇటీవల కాలంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గర్భిణీ, మహిళల గురించి గజల్ శ్రీనివాస్ తన అభిప్రాయాలను చెప్పిన విధానం వీక్షకులకు నవ్వులు తెప్పిస్తోంది. అయితే, తాను నాడు చెప్పిన మాటలకు.. ఇప్పుడు చేసిన చేష్టలకు పొంతన లేకపోవడంతో గజల్ శ్రీనివాస్‌పై నెటిజన్ల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
ఇంతకీ గర్భిణీ, మహిళల గురించి గజల్ శ్రీనివాస్ ఏం మాట్లాడాడంటే..!
తాను చేసే ప్రోగ్రామ్స్‌కు ఎక్కువ మంది మహిళలే వస్తారని, వారు నాతోకంటే.. నా భార్యతోనే ఎక్కువ మాట్లాడారని చెప్పారు. నాతో మాట్లాడేందుకు సాహసించరు. ఆ సమయంలో మూడీగా ఉండనుగానీ.. కామెడీగా అయితే అస్సలు ఉండను. ఎదుటి వాళ్లను చులకన చేసి మాట్లాడటం, తక్కువ చేసి మాట్లాడటం తనకు ఇష్టముండదన్నారు. ఎవరినైనా అండి అనే పిలుస్తాను. నువ్వు నువ్వు అని పిలవడం, చులకన చేసి మాట్లాడటం, తక్కువ కులం, ఎక్కువ కులం ఇలా బేధాభిప్రాయాలు వచ్చేలా ఎవరైనా మాట్లాడితే కొట్టేస్తానంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు గజల్ శ్రీనివాస్.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. గర్బిణీలు ఎవరైనా ఎదురైతే కారు ఆపి మరీ దండం పెట్టుకుంటానని, గర్భగుడిలో దేవుడు ఎంత ఇష్టమో.. గర్భంలో ఉన్న శిశువు ఊడా అంతే ఇష్టమని చెప్పుకొచ్చాడు. గర్భణీ అంటే ఎవరు..? ఈ దేశానికి రాబోయే తరాన్ని ఇచ్చే మహాదేవత, గర్బవతికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలండి.. గర్భవతుల్ని సరిగ్గా చూసుకోకపోయినా.., చిన్న పిల్లల్ని ఎవరైనా కొట్టినా.., తాను ఎదురు తిరుగుతానని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు గజల్ శ్రీనివాస్. అయితే, గజల్ శ్రీనివాస్ చెప్పిన మాటలకు.. ఇప్పుడు చేసిన చేష్టలకు పొంతన లేకపోవడంతో గజల్‌కు మిగిలింది ఫిడేలేనంటూ.. గజల్ శ్రీనివాస్‌పై సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి