జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో పవర్ స్టార్‌కు సంబంధించిన ఒక వార్త ట్రెండ్ అవుతోంది. అదే పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల విషయం. ఇప్పటికే ముగ్గురిని పెళ్లిళ్లు చేసుకున్న పవర్ స్టార్ అందులో మొదటి భార్య నందిని, రెండో భార్య రేణుదేశాయ్ కాగా,, వారిద్దరికీ పవన్ కల్యాణ్ అధికారికంగా విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ కల్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవా.
అయితే, ఇటీవల కాలంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ తన మూడో భార్య గురించి మాట్లాడారు. పవర్‌స్టార్ నటించిన తీన్‌మార్ సినిమాలో సహనటి అన్నా లెజీనోవాను ప్రేమించి పెళ్లి చేసుకున్నది తెలిసిన విషయమే. ప్రస్తుతం వీరికి ఓ పాప కూడా ఉంది. అంతేగాక, పాపకు క్రైస్తవ ఆచారం ప్రకారమే పోలెనా అనే పెరు కూడా పెట్టాడు పవన్ కళ్యాణ్. క్రైస్తవ మతం ప్రకారమే పాపను పెంచుతున్నామని, తన మూడో భార్య అన్నా లెజినోవా వయోలిన్‌ను కూడా వాయిస్తుందని చెప్పాడు పవన్. అలాగే తన రెండో భార్య కూతురు ఆద్య కోసం తాను ఇప్పుడిప్పుడే మరాఠిలో మాట్లాడేందుకు.. మరాఠి నేర్చుకుంటున్నానని చెప్పాడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.