ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నాయుడుకు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన యువనాయకుడు ,గుడివాడ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే కొడాలి నాని బంపర్ ఆఫర్ ప్రకటించారు.అప్పటి ఉమ్మడి రాష్ట్రం నుండి నేటి నవ్యాంధ్ర రాష్ట్రం వరకు కొడాలి నాని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి గుడివాడ అంటే నాని ..
నాని అంటే గుడివాడ అన్నట్లుగా బలమైన నాయకుడిగా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు .ఈ తరుణంలో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఇటివల ప్రజాక్షేత్రంలో గెలవలేక లోకేష్ నాయుడు ఎమ్మెల్సీగా నిలబడి మంత్రిగా పనిచేస్తున్న లోకేష్ గుడివాడ అసెంబ్లీ నియోజక వర్గం నుండి రానున్న ఎన్నికల్లో ఎట్లైన సరే టీడీపీ జెండా ఎగురవేయాలని ప్లాన్ చేస్తూ వైసీపీ శ్రేణులను ప్రలోభాలకు గురిచేస్తూ..
బెదిరింపులకు దిగుతూ టీడీపీ పార్టీలోకి చేర్చుకుంటున్నారు.ఈ క్రమంలో కొడాలి నాని ముఖ్య అనుచరుడు ,గుడివాడ వైసీపీ ఫ్లోర్ లీడర్ అయిన రవికాంత్ ను టీడీపీలో చేర్చుకున్నారు.అక్కడ ఉన్న కుళ్ళు కుట్రలు కుతంత్రాలు తట్టుకోలేక రవికాంత్ తిరిగి వైసీపీలోకి చేరారు .ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ “దమ్ముంటే బాబు చంద్రబాబు అయిన ఆయన తనయుడు అయిన లోకేష్ అయిన నాపై నిలబడి గెలవాలి .నేను ఉండనవసరంలేదు ..నా కటౌట్ పెడితే దానికి ప్రజలు ఓట్లు వేసి నన్ను గెలిపించి తీరుతారు .దమ్ముంటే నాపై నిలబడి గెలవాలని ఆయన బంపర్ ఆఫర్ ప్రకటించారు కొడాలి నాని.