బిగ్ బాస్ కార్యక్రమంతో అందరికి పరిచయమైనా క్రిటిక్ కత్తి మహేష్, బిగ్ బాస్ తరువాత నుండి సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో ఒక వెలుగు వెలుగుతున్న క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి దుమారం రేపే వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే పలుమార్లు ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించి మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన విషయం తెలిసిందే.
తాజాగా మరోసారి పవన్ కల్యాణ్‌పై కత్తి మహేష్ మండిపడ్డాడు. అసలు రాజకీయ పరిజ్ఞానం కానీ, పరిణితి కానీ పవన్‌కు లేవని ధ్వజమెత్తాడు. ఇన్నాళ్ల పాటు చర్చా కార్యక్రమాల్లో పవన్‌ను ఏకేసే కత్తి మహేష్.. పవన్ అభిమానులతో సవాల్ విసిరేవాడు. ఇంకా పవన్‌కు దమ్ముంటే తనతో చర్చకు రావాలని సవాల్ విసిరాడు. పవన్ కల్యాణ్‌కు నిజంగా రాజకీయాలపై చిత్తశుద్ధి వుంటే.. రాష్ట్ర రాజకీయాలపై చర్చించాలనుకుంటే పవన్‌తో తాను చర్చకు సిద్ధమని కత్తి మహేష్ సవాల్ విసిరాడు. పెళ్లాన్ని కాపాడుకోలేని వాడు రాష్ట్రాన్ని ఏం కాపాడతాడని ఎద్దేవా చేశాడు. పార్టీ ఆఫీసును ప్రారంభించి.. దానికి పూజలు చేసినంత మాత్రాన నాయకుడు అయిపోడని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అసలు పవన్‌కు కామన్‌సెన్సే లేదని, ప్రజాస్వామ్యం గురించి అస్సలు తెలియదని కత్తి మహేష్ అన్నాడు.