ఏపీలో టీడీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జన్మభూమి కార్యక్రమంలో రాష్ర్ట ప్రజల మొత్తం అవీనితిని నిలదీస్తుంటే పక్కనే ఉన్న తెలుగు తమ్ముళ్లు అమర్యదాపూర్వకంగా ప్రవర్తిస్తున్నారు. అంతేగాక టీడీపీ నేతలే కాదు ముఖ్యమంత్రే ఇలా చేస్తుంటే ఏమి చేయాలో తెలుగు ప్రజలకు అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగిందంటే పులివెందుల జన్మభూమి సభలో గండికోట, చిత్రవతి ఎత్తిపోతల పథకం ప్రారంభ సభలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రసంగాన్ని టీడీపీ నేతలు అడుగడుగునా అడ్డుకున్నారు. ఓ దశలో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు ఆయనను చుట్టుముట్టి… చేతిలోని మైక్‌ను కూడా లాక్కునేందుకు యత్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఎంపీ పట్ల టీడీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారు. సాక్షాత్తూ సీఎం కూడా అదే పంథాను అనుసరించారు. ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడనివ్వకుండా ఏయ్..మైక్ తీసుకో… ఇక్కడ ఏమీ మాట్లాడవద్దు అంటూ మైక్ కట్ చేయించారు. అంతేకాకుండా ఎవరేం చేశారో ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు, చెప్పదలుచుకున్న విషయాన్ని రాతపూర్వకంగా ఇవ్వాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. అయితే చంద్రబాబు, టీడీపీ నేతల తీరుపై అవినాష్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.బహిరంగ సభలో నిజాలు మాట్లాడకూడదా?. ఒక ఎంపీకి ఇచ్చే గౌరవం ఇదేనా?. అది తెలుగుదేశం సమావేశమా? లేక జమ్మభూమి కార్యక్రమమా?అని వైసీపీ నేతలు అంటున్నారు.
