గజల్ శ్రీనివాస్ సమాజానికి కనిపించేది ఓ వ్యక్తి అయితే.. ఆఫీసులో మరో వ్యక్తిలా ఉంటాడని తెలిపారు. తన కోరిక తీర్చాలని తనను గజల్ శ్రీనివాస్ వేధింపులకు గురిచేశాడని తెలిపారు. ఈ విషయం ఎవరికీ చెప్పినా వినరనే.. తనను తాను కాపాడుకునేందుకే తాను ఈ వీడియోలు, ఫొటోలు రహస్యంగా తీసినట్లు బాధితురాలు తెలిపారు. గజల్ శ్రీనివాస్‌తో శరీరకంగా సంబంధం కలిగిన పనిమనిషి మీడియాకు అవాస్తవాలు చెప్పారని అన్నారు. ‘నేను గజల్ శ్రీనివాస్‌తో సెక్స్‌లో పాల్గొంటాను. నీవు కూడా అలాగే చేయ్. నాక్కూడా ఫ్యామిలీ, పిల్లలు ఉన్నారు. అయినా నా భర్తకు తెలియకుండా చేస్తున్నా’ అని పనిమనిషి తనను బలవంతపెట్టిందని బాధితురాలు తెలిపారు. బాధితురాలికి గజల్ బెదిరింపులు లైంగిక వేధింపుల నేపథ్యంలో తాను జాబ్ వదిలేసి పోదామని నిర్ణయించుకున్నానని, అయితే, గజల్ శ్రీనివాస్ తనను బెదిరింపులకు గురిచేశాడని తెలిపారు. నీకు ఎక్కడా కూడా జాబ్ దొరక్కుండా చేస్తానని, ఫ్యూచర్ లేకుండా చేస్తానని బెదిరించాడని చెప్పారు. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వనని, దొంగతనం లాంటి కేసులను కూడా పెడతానంటూ బెదిరించాడని తెలిపారు.
గజల్ శ్రీనివాస్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో పంజాగుట్ట పీఎస్‌లో ఏసీపీ విజయ్‌కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధిత మహిళ సమర్పించిన వీడియో దృశ్యాలు, అన్ని ఆధారాలను పరిశీలించాకే శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశామని తెలిపారు. ఆయన గత రెండు నెలలుగా బాధితురాలిని వేధిస్తున్నాడని, అందుకు సంబంధించి ఆధారాలను కూడా ఆమె సమర్పించినట్లు వెల్లడించారు. తాను ఆధ్యాత్మికంగా జీవించే మహిళనని.. గజల్ శ్రీనివాస్ రెండు నెలలుగా వేధిస్తున్నాడంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. శ్రీనివాస్‌కు అనుకూలంగా వ్యవహరించిందంటూ ఆయన మహిళా అటెండర్‌పై కూడా బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఆమెపై కూడా కేసు నమోదు చేసినట్లు ఏసీపీ విజయ్ కుమార్ చెప్పారు.