తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో దారణం చోటు చేసుకుంది. రాత్రి వేళల్లో పక్కలో మూత్రం పోస్తుందని కన్న తండ్రే తన కూతురుకు ఒంటి నిండా వాతలు పెట్టాడు.వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరంలోని ఎ క్లాస్ కాలనీలో ఉండే రాజు వ్యాన్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు 11 ఏళ్ల కూతురు ఉంది. చిన్నారి రాత్రి వేళల్లో పక్క తడుపుతోంది. దీనిపై ఆగ్రహం చెందిన రాజు.. కన్న కూతురని చూడకుండా ఒంటి నిండా వాతలు పెట్టాడు. విషయం తెలుసుకున్న బాలల హక్కుల సంఘం తుకారాం గేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
