ఏపీలో సీనియర్ నేతలు వలసబాట పడుతున్నారు. తాజాగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఫ్యాన్ పంచన బోతున్నారు…విభజన ఎఫెక్ట్ నుంచి కాంగ్రెస్ ఇంకా కోలుకోలేకపోతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ఉనికి కాపాడుకోలేకపోయిన హస్తం… రానున్న 2019ఎన్నికల్లో కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే ఆ పార్టీని నమ్ముకుంటే లాభం లేదని సీనియర్ నేతలు హస్తానికి బై చెప్పేస్తున్నారు.మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి.. ప్రతిపక్ష పార్టీ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అది ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. నాదెండ్ల వైసీపీలో చేరడం ఖాయమని వార్తలు వచ్చాయి.తేదీని కూడా ఫిక్స్ చేసేసారు. ఇక అంతా రెడీ అనుకున్న సమయంలో ఆయన చేరిక ఎందుకో ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ అంశం తెరమీదకు వచ్చింది. నాదెండ్ల వైకాపాలో చేరడానికి సంబంధించి కొత్త వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం తెనాలి నియోజకవర్గం పరిధిలో ఒక టెలిఫోనిక్ సర్వే జరుగుతోందట. నియోజకవర్గం పరిధిలోని వాళ్లకు ఈ కాల్స్ వస్తున్నాయట. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఎవరైతే బాగుంటారని మీరు అనుకుంటున్నారు.. అనే అంశంపై ఈ సర్వే జరుగుతున్నట్టు అర్ధం అవుతోంది. నాదెండ్ల ఫ్యామిలీది కాంగ్రెస్ పార్టీనే. ఆయన తండ్రి నాదెండ్ల భాస్కర్ ఒక్క నెల ముఖ్యమంత్రిగా చేసింది కూడా కాంగ్రెస్ హయాంలోనే. నాదెండ్ల ఫ్యామిలీ నుంచి రెండో తరంగా కాంగ్రెస్ లో అడుగు పెట్టిన నాదెండ్ల మనోహర్ రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2011లో స్పీకర్ గా బాధ్యతలు చేపట్టారు…వైఎస్ ఫ్యామిలీతో నాదెండ్లకు మంచి అనుబంధం ఉండడంతో… వైసీపీ జెండానే కప్పుకోవాలని డిసైడ్ అయిపోయినట్లు తెలుస్తోంది..