నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ప్రముఖ యాంకర్ ప్రదీప్ ఈ రోజు కౌన్సెలింగ్ కు డుమ్మా కొట్టాడు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన అందరికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చామని ట్రాఫిక్ అదనపు డీసీపీ అమర్‌కాంత్ రెడ్డి తెలిపారు. అయితే ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన మరుసటి రోజు నుండి నిర్వహించిన కౌన్సెలింగ్‌కు హాజరు కాలేదని డీసీపీ చెప్పారు. అయితే కౌన్సెలింగ్ కు హాజరు కావడానికి శుక్రవారం వరకు టైం ఉంది, కాబట్టి ప్రదీప్ కౌన్సెలింగ్‌కు ఎప్పుడు వస్తాడో తెలియదు అని అన్నారు .డ్రంక్ అండ్ డ్రైవ్‌లో నిర్వహించిన బ్రీత్ అనలైజర్ పరీక్షలో ప్రదీప్‌కు 178 పాయింట్లు రికార్డయిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం డ్రైంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డవారిని ట్రాఫిక్ పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.
ప్రదీప్ ఈ అవమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు, మంచి యాంకర్ గా పేరు తెచ్చుకున్న నాకు ఇలా జరిగింది ఏంటి అని ఎంతో బాధ పడుతున్నట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా ఈ అవమానాన్ని భరించలేక విధంగా రకరకాలుగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది, అనవసరంగా తాగాను,ఇక నుండి జీవితంలో ఇక తాగను.నా పరువు మొత్తం పోయిందని పరమార్శకు వచ్చిన ప్రరి ఒక్కరి దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు.వచ్చిన వారు అడిగినా అడగకపోయిన జరిగింది మొత్తం వివరించి మరి ఏడుస్తున్నాడట ప్రదీప్.గల గల మాట్లడే ప్రదీప్ ఒక్క సారిగా అయోమయంలోకి వెళ్లేసరికి వచ్చిన వారికి ఏం చెప్పాలో తెలియడం లేదట.మీడియా ఓవర్ యాక్షన్ చేయడం వల్లే ఇదంతా జరిగిందని,ప్రదీప్ మరి ఈ సిచ్చ్యుయేషన్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి అంటున్నారు అటు ఫ్యాన్స్ కి తోటి కళాకారులు.