ఏపీలో ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సమస్యల కొసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 50వ రోజుకి చేరుకుంది. టీడీపీ అన్యాయాలనువివరిస్తూనే.. వారికి నేనున్నానంటూ ప్రజాసంకల్పయాత్ర ద్వారా వైఎస్ జగన్ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం సీటీఎం నుంచి వైఎస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. ఈరోజు పాదయాత్ర పులవండ్ల పల్లి, కాశీరావు పేట, వాల్మీకిపురం, ఐటీఐ కాలనీ, పునుగుపల్లి, విఠలం, టీఎమ్ లోయ మీదుగా జమ్మిలవారిపల్లి వరకు కొనసాగుతుంది.
