ప్రస్తుతం ఈ ఫోటో దేశ వ్యాప్తంగా ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో పాటుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అంతే కాకుండా దేశ వ్యాప్తంగా అందరు ఈ పోలీసు హీరో అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.ఇంతకు విషయం ఏమిటి అంటే ఇటివల జరిగిన కమలా మిల్స్ కాంపౌండ్ ప్రమాద ఘటనలో మొత్తం పద్నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఆ ప్రమాద సమయంలో సమయానికి తగిన తన సమయ స్ఫూర్తి,
ధైర్యం ప్రదర్శించి ఎనిమిది ప్రాణాలు కాపాడాడు సుదర్శన్ శివాజీ షిండే అనే కానిస్టేబుల్.
ఆ క్రమంలో ఆయన ఒక మహిళను తన భుజాన వేసుకొని మోస్తున్న పోటో ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతుంది .ఈ సమయంలో సుదర్శన్ విధి నిర్వహణలో అతని పనితీరుకు మెచ్చి ముంబై పోలీస్ కమిషనరేట్ అతనిని సన్మానించింది. ఈ కార్యక్రమానికి కమిషనర్ దత్తాత్రేయ పడ్సల్గికర్, మేయర్ విశ్వనాథ్ మహదేశ్వర్‌లు హాజరై శివాజీని సన్మానించి ప్రశంసలు కురిపించారు. అనంతరం శివాజీ మాట్లాడుతూ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు.
ఘటన గురించి వివరిస్తూ.. ‘‘అర్ధరాత్రి 12గం.30ని. సమయంలో వైర్‌లెస్ ద్వారా సమాచారం నాకు అందించింది. వెంటనే నా బృందంతో అక్కడికి చేరుకున్నాం. అప్పటికే అక్కడ దట్టమైన పొగ, మంటలు అలుముకున్నాయి. అరుపులు, అగ్నిమాపక సిబ్బంది సహయక చర్యలతో హడావుడిగా ఉండటంతో రంగంలోకి దిగి తమ ప్రయత్నం తాము చేశాం అని ఆయన తెలిపారు.