టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుండి వరుస సినిమాలతో దూసుకెళుతున్నబక్కపలుచు భామ అందాల రాక్షసి రకుల్ ప్రీత్ సింగ్. ఒకవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస అవకాశాలతో దూసుకుపోతూనే మరోవైపు బాలీవుడ్‌లోనూ అవకాశాలను తన సొంతం చేసుకుంటుంది ముద్దు గుమ్మ.ఒకేసారి టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తున్నారు.
మీకు ఇబ్బంది ఏమి లేదా అని అడిగితె అమ్మడు ముసి ముసి నవ్వులు నవుతూ సమాధానం ఇచ్చారు .ఆమె మాట్లాడుతూ ‘రంగుల ప్రపంచమైన సినిమా ఇండస్ట్రీలో కి రావాలన్నది నా కల. నాకు నచ్చిన రంగంలోనే ఉన్నందుకు సంతోషంగా ఉంది. సినిమాలే నా ఫస్ట్ లవ్. నా మాతృ భాష పంజాబీ. కానీ ఇప్పుడు పంజాబీ కంటే తెలుగు బాగా మాట్లాడుతున్నాను.
2018 నూతన సంవత్సరంలో నేను ఒకటి నిర్ణయించుకున్నాను. అదేంటంటే.. ఇక నుంచి నేను నటించే తెలుగు సినిమాలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను. కెమెరా ముందు ఎంత సేపు ఉండమన్నా ఉంటాను. కెమెరా ముందు నిలబడితే నాకు కలిగే ఆనందం ప్రపంచంలో మరెక్కడా నాకు దొరకదు. ఏకదాటిగా 12 గంటలు కెమెరా ముందు ఉండమన్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నాకు సినిమాలపై ఉన్న ఆసక్తి అలాంటిది.అంటూ చెప్పుకొచ్చింది .