తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే తొలిసారిగా మిషన్ భగీరథ పథకంలో భాగంగా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలో ఇంటింటికి త్రాగునీటి సరఫరాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశాయిపేట గ్రామంలో మొత్తం 704 ఇండ్లకు మంచినీటి సరఫరాను ప్రారంభించామని తెలిపారు. ఇక నుంచి మహిళల మంచినీటి కష్టాలకు తెరపడిందన్నారు. మరో నెల రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు సరఫరా చేస్తామని ప్రకటించారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, ఎకరానికి రూ. 4 వేల పెట్టుబడి ఇవ్వడం గొప్ప విషయమన్నారు
