జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై ఒంటికాలిపై లేచే సినీ విమర్శకుడు కత్తిమహేష్ తన దూకుడు మరింత పెంచారు. ఇప్పటికే పలు అంశాలపై స్పందించిన కత్తి మహేష్ తాజాగా న్యూ ఇయర్ వేడుకగా కూడా పవన్‌పై స్పందించారు. ఇటుసోషల్ మీడియాలో అటు ఇంటర్వ్యూలో విరుచుకుపడ్డారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటానంటూ పవన్ కల్యాణ్, జనసేన అభిమానులు లక్ష్యంగా ఓ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఇదే సందర్భంగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ రాజకీయ జోకర్ అంటూ కత్తి మహేష్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మళ్లీ ఆయనే వివరణ ఇచ్చాడు. ఓట్లు చీల్చేందుకు ఓ రాజకీయ జోకర్ లా పవన్ పాలిటిక్స్ లోకి వచ్చారని దుయ్యబట్టాడు. అంతేకాదు 2019 ఎన్నికల్లో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే తాను అక్కడి నుంచే పోటీ చేసి ఆయన దిగజారుడు రాజకీయాల్ని ఎండగడతానని చెప్పాడు. తిక్కసేన , పిచ్చి సేనానితో గత కొద్దికాలంగా పోరాడుతున్నానని కత్తి అన్నాడు. దీన్ని కొనసాగిస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా పవన్ అభిమానుల తీరును కత్తి మహేష్ తప్పుపట్టారు. తాను ఏ రివ్యూ రాసినా ..పవన్ కల్యాణ్ అభిమానులు అసభ్య పదజాలంతో దూషిస్తూ కామెంట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అభిమానులు ఏం చేసినా పవన్ మాట్లాడడని అసహనం వ్యక్తం చేశారు. `గతంలో కట్టుకున్న భార్య రేణూ దేశాయ్ పై కామెంట్ చేస్తేనే పవన్ పట్టించుకోలేదు. తనని తిట్టిపోస్తే పవన్ స్పందిస్తాడా?` అంటూ కత్తి సందేహం వ్యక్తం చేశాడు. అయినా ఈ వివాదానికి పవన్ ఫుల్ స్టాప్ పెట్టగలరని పేర్కొంటూ కానీ ఆ పని చేయడం లేదన్నారు. ‘కత్తి మహేష్‌పై దాడిని ఆపండి’ అంటూ పవన్ ఒక్క ట్వీట్ చేసినా… దీనికి ముగింపు పడుతుందని కత్తి మహేష్ చెప్పుకొచ్చాడు. కానీ పవన్ ఎందుకు ఆ పనిచేయడం లేదని అన్నారు.