నూతన సంవత్సర ప్రారంభం రోజున జరిగే వేడుకల గురించి చెప్పనక్కర్లేదు. ఇక సెలబ్రిటీస్ అయితే మరీను. నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాల నడుమ ఆహ్వానిస్తారు. ఆ సందర్భంలో దిగిన సెల్ఫీలను సోషల్ మీడియాలో పెడుతూ కామెంట్స్ కోసం ఎదురు చూస్తారు. అయితే, అక్కినేని వారింట ఇటీవల అడుగిడిన సమంత అలానే చేసిందట. తాను న్యూ ఇయర్ సందర్భంగా తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పెట్టిందట సమంత.
అయితే, ఆ ఫోటో చూసేందుకు.. కాస్తా అభ్యంతరకరంగా ఉండటంతో సమంతపై నాగార్జున ఫైర్ అయ్యాడట. నువ్వు మా ఇంట కోడలిగా అడుగుపెట్టడం మాకు ఆనందంగా ఉంది. అంతేగాక మాకు బాగా కలిసి వస్తోంది. అటువంటిది నీవు ఇలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడం ఏమీ బాగోలేదని, ఇకపై ఇలా చేయొద్దని సమంతకు నాగార్జున సూచించాడట. అంతటితో ఆగక ఇటువంటి ఫోటోలను సోషల్ మీడియా వరకు పోకుండా.. నాగచైతన్యకు నీకు మధ్య పరిమితమైతే ఇంకా బాగుంటుందని సమంతకు సెలవిచ్చాడట నాగార్జున.