తెలుగు బుల్లితెర పై నెంబర్ వన్ ప్రోగ్రాంగా దూసుకుపోతున్న జబర్ధస్థ్ షో పై వివాదాలు కూడా ఎక్కువగా చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే అనేక వివాదాలతో చుట్టుముట్టినా.. జబర్ధస్థ్ తీరు మాత్రం అసుల మార్చుకోవడం లేదు. అందులో ముఖ్యంగా టీమ్ లీడర్ హైపర్ ఆది వేసే పంచ్‌లు మాత్రం అనేక వివాదాలకు కేంద్రబిందువు అవుతున్నాయి.
అతి తక్కువ కాలంలోనే ఫేం కొట్టేసిన హైపర్ ఆది.. వేసే పంచ్‌లు రోజు రోజుకీ దిగజారి పోతున్నాయి.. ఇటీవల ప్రముఖ తెలుగు సినిమా క్రిటిక్ మహేష్ కత్తిని టార్గెట్ చేస్తూ.. తన స్కిట్‌లలో అతని పోట్ట బట్ట పై పంచ్‌లు వేసిన సంగతి తెలిసిందే. దీంతో లైవ్ డిబేట్‌లో మహేష్ కత్తి అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక గుడ్లు తేలేశాడు. ఇక ఆ తర్వాత అనాథల పై పంచ్‌లు వేయంతో ఏకంగా ఆ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కే వెళ్ళింది. ఇలా వరుసగా ఆది తన పంచ్‌లతో బుల్లితెరను మొత్తం బూతు తెరగా మారుస్తున్నాడు.
అయితే, ఇటీవల విడుదల చేసిన జబర్దస్త్ ప్రోమోలో హైపర్ ఆది సంభాషణలు మరో సారి వివాదానికి తెరతీసేలా ఉన్నాయి. అసలు విషయానికొస్తే.. హైపర్ ఆది టీమ్‌లో దొరబాబు ప్రోగ్రామ్‌లో భాగంగా లేడీ గెటప్ వేసిన ఓ వ్యక్తిని కౌగిలించుకుంటాడు. ఇది గమనించిన హైపర్ ఆది.. నువ్వింకా.. మారలేదంట్రా అంటూ అనగా.. స్పందించిన అలవాటులో పొరపాటులేరా అంటూ సరిదిద్దుకుంటాడు. ఈ క్రమంలోనే హైపర్ ఆది పంచ్ పేలుస్తూ.. ఒకసారి చేస్తే తప్పు అంటారు.. పదే పదే చేస్తే పప్పు అంటారు.
ఇలా.. హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలు పలువురిని ఆలోచనలో పడేశాయి. అయితే, ఇటీవల కాలంలో ఇండియా పప్పు రాహుల్ గాంధీ.. ఆంధ్రాపప్పు నారా లోకేష్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అందులోనూ.. నారా లోకేష్ గతంలో తాను ఇచ్చిన స్పీచ్‌లలో అనేకమార్లు నోరుజారిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల సమయంలో మత పిచ్చి.. కుల పిచ్చి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క టీడీపీయే అని, అంబేద్కర్ వర్ధంతికి శుభాకాంక్షలు చెప్పడం,
అంతేగాక, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాల్లో ఏపీకి ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చారో చెప్పాలంటూ డిమాండ్ చేసి అందరిలో నవ్వులపాలయ్యాడు నారా లోకేష్. ఇలా చెప్పడంతో నారా లోకేష్‌పై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
అయితే, జబర్దస్త్ ప్రోమో చూసిన బుల్లితెర ప్రేక్షకులు.. ఒక్కసారి చేస్తే తప్పు అంటారు.. మళ్లీ.. మళ్లీ చేస్తే పప్పు అంటారు అంటూ.. హైపర్ ఆది అన్న పంచ్ నారా లోకేష్‌కు సరిగ్గా సరిపోద్ది అని, నారా లోకేష్‌పై హైపర్ ఆది పంచ్ అదిరిందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుండటం గమనార్హం.