టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సినీ క్రిటిక్ మహేష్ కత్తి సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ పవర్ స్టార్ ,జనసేన అధినేత ,ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ పై విరుచుకుపడుతూ పీకే ఫ్యాన్స్‌కు చుక్కలు చూపిస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా తన కత్తికి పదును పెడుతున్న మహేష్ తాజాగా మరోసారి జనసేన అధినేత పై కత్తి దూశాడు.
తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను.. పవన్ కల్యాణ్ కలిసిన విషయం తెలిసిందే. ఇదే విషయం పై కత్తి మహేష్ స్పందిస్తూ.. ప్రగతిభవన్‌లో పవన్ కల్యాణ్ పడిగాపులు. ముఖ్యమంత్రికి విషెస్ చెప్పడానికా.. అజ్ఞాతవాసి ప్రీమియర్లకు పర్మిషన్‌కా.. అని ఫేస్‌బుక్‌లో కామెంట్ చేశాడు. అలాగే అజ్ఞాతవాసి ప్రీమియర్ షోస్ ఎన్ని పడతాయో చెప్పు బ్రదర్ ఆఫ్ మెగాస్టార్ అని మరో కామెంట్ చేశాడు.
దీంతో పవన్ అభిమానులు కత్తి వ్యాఖ్యల పై విరుచుకుపడుతున్నారు. మహేష్ కత్తి తమ అభిమాన నటుడిని, తమ ఆరాధ్య దైవాన్ని ఇలా ఛాన్స్ దొరికినప్పుడల్లా విమర్శిస్తుండడం పై ఫాన్స్‌లో ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. ఏదో ఒక రోజు కత్తి మహేష్‌ని చంపేస్తా.. నరికేస్తాం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.