ఆంధ్రప్రదేశ్ లోని కొందరు టీడీపీ నాయకుల మద్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఫిరాయింప్ ఎమ్మెల్యేలకు కూడ ఇదే పరిస్థితి. వీరి దెబ్బకు చంద్రబాబు తల పట్టుకుంటున్నాడు. అయితే నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టగానే పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఆమె వెంట ఉన్న అనుచరులు, కార్యకర్తలు ఏవీ సుబ్బారెడ్డి వైపు తిరగారు బంధువులు సైతం మంత్రి మాట వినకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
ఆదివారం ఆళ్లగడ్డలో విందు కార్యక్రమం ఏర్పాటు చేశామని..అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా హాజరు కావాలని అధికార పార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. అయితే ఈ విందుకు ఎవరూ వెళ్లవద్దని మంత్రి అఖిలప్రియ తన ప్రధాన అనుచరుడితో కార్యకర్తలకు, బంధువులకు ఫోన్ చేయించారు. అయితే మంత్రి ఆదేశాలను వినకుండా ఈ విందుకు 10వేల మంది వరకు హాజరయ్యారు. అంతేకాదు మంత్రి అఖిల ప్రియ ఏవీ సుబ్బారెడ్డిని ఖాతరు చేయకపోవడంతో ఆళ్లగడ్డలో ఆయన తిష్టవేశారు. తన బలాన్ని నిరుపించుకుంటున్నాడు. ఒకవేళ టీడీపీ తనని పట్టించుకోకుండా అఖిలప్రియకు మొగ్గ చూపితే..పార్టీమారుతారనే ప్రచారం జరుగుతోంది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం అయిన వైపీపీలోకి చేరే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఒక వేళ వైసీపీకూడా టిక్కెట్ ఇవ్వకపోతే…తాను ఆ పార్టీకి మద్దతుదారుగా ఉండి…భూమానాగిరెడ్డి కుటుంబాన్ని దెబ్బతీస్తానని స్పష్టం చేస్తున్నారట. మంత్రి అఖిలప్రియ వ్యవహారశైలి నచ్చకే ‘సుబ్బారెడ్డి’ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని స్థానిక టిడిపి నాయకులు చెబుతున్నారు. ఎలాగైన మంత్రి అఖిలకు ఏవీ సుబ్బారెడ్డి 2019లో గట్టి షాక్ ఇస్తున్నట్లు సమచారం. ఇందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం కర్నూల్ రాజకీయాల్లో పెద్ద సంఛలనంగా మారింది.చూడాలి చివరకు ఏమి జరుగుతుందో…?