తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.స్వయంగా రైలు డ్రైవరే రైలు ఆపి తన మానవత్వాన్ని చాటుకున్నాడు..వివరాల్లోకి వెళ్తే మానకొండూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ఎరుకల సత్యరవీందర్గౌడ్కు 16 సంవత్సరాల క్రితం పెద్దపల్లి జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన శోభారాణితో వివాహమైంది. అయితే కుటుంబ౦లొ తలెత్తెన చిన్న చిన్న వివాదాల కారణంగా దంపతులు పదిహేనేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు.
గత కొంతకాలం క్రితం ఆస్తి పంపకాల విషయంలోనూ గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో జీవితంపై విరక్తి పెంచుకున్న ఆయన ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు . సోమవారం చివరిసారిగా తన భార్యను చూసేందుకు కూనారం వెళ్లాడు. ఆమె లేకపోవడంతో..కుమారుణ్ని కలిశాడు. తర్వాత పోత్కపల్లి సమీపంలోని గొల్లపల్లి రైల్వేగేటు పట్టాలపై పడుకున్నాడు. కాజీపేట నుంచి బలార్షా వైపు వెళ్తున్న కేరళ ఎక్స్ప్రెస్ డ్రైవర్ దూరం నుంచి గమనించి సమీపంలో రైలు ఆపి అక్కడున్న స్థానికులకు అప్పగించాడు .దీన్తో రైలు డ్రైవర్ పై స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు