తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏడాది ప్రారంభంలోనే బిగ్ షాక్ తగలనున్నది .మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తిష్ట వేయాలని కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీ నేతల ఆశలు అడియాశలు అయ్యే సూచనలే ఎక్కువగా కన్పిస్తున్నాయి.ఇప్పటికే కేంద్రంలో ప్రధాన ప్రతి పక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అధికారం దక్కే అవకాశాలు కనుచూపు మేర కూడా లేనట్లు కనిపిస్తుంది.
అసలు విషయానికి వస్తే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైన ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎక్కువ కాలం మంత్రిగా పని చేసిన మోస్ట్ సీనియర్ నాయకుడు ఒకరు టీఆర్ఎస్ పార్టీలోకి రానున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత ,మాజీ సీనియర్ మంత్రి జానారెడ్డి గతంలో మాట్లాడుతూ వచ్చే ఏడాది తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటును అందిస్తే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేస్తాను అని ఆయన ప్రగల్భాలు పలికిన సంగతి తెల్సిందే .
అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు ఈ ఏడాది ప్రారంభం జనవరి ఒకటో తారిఖు మొదలు నుండే రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే.అయితే నిన్నటి అర్ధరాత్రి నుండి తెలంగాణ వ్యాప్తంగా అన్ని రంగాల వారికీ ఇరవై నాలుగు గంటలు కరెంటును అందిస్తుంది సర్కారు.దీంతో జానారెడ్డి అన్నట్లు మాట మీద నిలబడి త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలోకి వస్తారు.రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేయడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు..చూడాలి మరి జానారెడ్డి అన్న మాట మీద నిలబడతారో లేదో ..?