తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంచలనం చోటు చేసుకుంది .ఏకంగా ఇటివల టీడీపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ,ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు .మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ అసలు తమ పార్టీలో బాహుబలి ఎవరని, రేవంత్ రెడ్డి వచ్చాకే కాంగ్రెస్ పార్టీలో ఊపు వచ్చిందనడాన్ని తాను అంగీకరించనని ఆమె వెల్లడించారు .
ఒక ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరాక ఆయనే బాహుబలి అని కొందరు అనే ప్రచారం మీద మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందనే రేవంత్ రెడ్డి తమ పార్టీలోకి వచ్చారని తెలిపారు. వేరే పార్టీలు ఏవీ బలంగా లేవు కాబట్టి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయం కాబట్టి రేవంత్ రెడ్డి తమ పార్టీలో చేరారనిఆమె వ్యాఖ్యానించారు. తాను రేవంత్ రెడ్డి రాకను వ్యతిరేకించానన్న ప్రచారంలో నిజం లేదని, అసత్య ప్రచారం జరిగిందని చెప్పారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారన్న విషయాన్ని కొందరు రహస్యంగానే ఉంచారని తెలిపారు.