Home / MOVIES / కాలేజ్ డేస్ లో ఒక అమ్మాయి గురించి…సంఛలన వ్యాఖ్యలు చేసిన… ఆది

కాలేజ్ డేస్ లో ఒక అమ్మాయి గురించి…సంఛలన వ్యాఖ్యలు చేసిన… ఆది

తెలుగు బుల్లితెర పై నెంబ‌ర్ వ‌న్ ప్రోగ్రాంగా దూసుకుపోతున్న జ‌బ‌ర్ధ‌స్థ్ షో పై వివాదాలు కూడా ఎక్కువ‌గా చుట్టుముడుతున్నాయి. ఇప్ప‌టికే అనేక వివాదాలతో చుట్టుముట్టినా.. జ‌బ‌ర్ధ‌స్థ్ తీరు మాత్రం అసుల మార్చుకోవ‌డం లేదు. అందులో ముఖ్యంగా టీమ్ లీడ‌ర్ హైప‌ర్ ఆది వేసే పంచ్‌లు మాత్రం అనేక వివాదాల‌కు కేంద్ర‌బిందువు అవుతున్నాయి.

అతి త‌క్కువ కాలంలోనే ఫేం కొట్టేసిన హైప‌ర్ ఆది.. వేసే పంచ్‌లు రోజు రోజుకీ దిగ‌జారి పోతున్నాయి.. ఇటీవ‌ల ప్ర‌ముఖ తెలుగు సినిమా క్రిటిక్ మ‌హేష్ క‌త్తిని టార్గెట్ చేస్తూ.. త‌న స్కిట్‌ల‌లో అత‌ని పోట్ట బ‌ట్ట పై పంచ్‌లు వేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో లైవ్ డిబేట్‌లో మ‌హేష్ క‌త్తి అడిగే ప్ర‌శ్న‌ల‌కి స‌మాధానాలు చెప్ప‌లేక గుడ్లు తేలేశాడు. ఇక ఆ త‌ర్వాత అనాథ‌ల పై పంచ్‌లు వేయంతో ఏకంగా ఆ వ్య‌వ‌హారం పోలీస్ స్టేష‌న్‌కే వెళ్ళింది. ఇలా వ‌రుస‌గా ఆది త‌న పంచ్‌ల‌తో బుల్లితెర‌ను మొత్తం బూతు తెర‌గా మారుస్తున్నాడు. అయితే తాజాగా ఓ యు ట్యూబ్ చానెళ్ల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో హైపర్ ఆది, కాలేజ్ డేస్ గురించిన కొన్ని విషయాలను ప్రస్తావించాడు. బీటెక్ లో ఉండగా వెనుక బెంచ్ లో కూర్చుని, ఫ్రెండ్స్ తో కలిసి ఒకటే సందడి చేసే వాడిని. నేను ఒక్కరోజు కాలేజ్ కి వెళ్లకపోయినా ‘ఈ రోజు ఆది రాలేదురా .. క్లాస్ బోర్ కొడుతోంది’ అనుకునేవాళ్లు. ఫ్రెండ్స్ తో కలిసి సందడి చేసినా, మంచి మార్కులు వచ్చేలా చూసుకునేవాడిని’ అన్నాడు. ‘ఎవరితోనైనా లవ్ లో పడ్డారా? లవ్ మ్యారేజ్ చేసుకుంటారా?’ అనే ప్రశ్నకి ఆది స్పందిస్తూ …కాలేజ్ డేస్ లోను ఒక అమ్మాయినే ఎక్కువగా చూసేవాడిని .. ఆ అమ్మాయినే బాగా ఇష్టపడేవాడిని. పేరు చెప్పకూడదు .. ఆ అమ్మాయికి పెళ్లైపోయింది. అన్నాడు. ప్రస్తుతం ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. హైపర్ ఆది ఎక్కువగా చూసే.. బాగా ఇష్టపడే..పెళ్లి అయిన అమ్మాయి ఎవరు…! అని తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat