కర్నూలు జిల్లా చెన్నంపల్లి గ్రామం పరిధిలోగల గుప్త నిధులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కన్ను పడిందా..? అంతటితో ఆగక ఆ నిధులను చంద్రబాబు స్వాహా చేయనున్నారా..? చంద్రబాబు సర్కార్ మళ్లీ ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కిందా..? ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు.
అసలు విషయానికొస్తే.. కర్నూలు జిల్లా చెన్నంపల్లి గుప్త నిధులపై టీడీపీ నేతల వేట పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారిక సమాచారం టీడీపీ నేతలు ఖనిజాల కోసం తవ్వకాలకు పూనుకోవడమే. అయితే, ఈ విషయం కాస్తా తెలిసి గ్రామస్థులు తిరగబడటం, మీడియా హడావుడి చేయడంతో విలువైన ఖనిజాల కోసం తవ్వకాలంటూ చంద్రబాబు సర్కార్ తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు యత్నించిన విషయం విధితమే. అయతే, అసలు ఖనిజాల తవ్వకాల కోసం కేంద్రం అనుమతి తప్పనిసరి, కేంద్రం నుంచి అనుమతి వస్తేనే తవ్వకాలు చేపట్టాలి. అయితే, చంద్రబాబు తన సొంత రాజ్యం తరహాలో తన యంత్రాంగాన్ని నడిపించి చెన్నంపల్లి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపించారు. ఇదంతా తెర వెనుక అయితే,
తెర ముందు ఇలా.. జరుగుతోంది. గత శనివారం జరిగిన కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో.. చెన్నంపల్లి గుప్త నిధుల తవ్వకాలపై సంబంధిత జిల్లా కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎంత వీలైతే.. అంత త్వరగా గుప్త నిధుల తవ్వకాలను వేగవంతం చేయండి అంటూ కలెక్టర్‌ను చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటి వరకు ఎంత వరకు గుప్త నిధులు బయటపడ్డాయి..? అన్న విషయంపై ఆరాతీశారు చంద్రబాబు.
అయితే, మరో వైపు చంద్రబాబు ప్లాన్ మరోలా ఉందంటున్నారు చెన్నంపల్లి గ్రామస్తులు. అనుమానాస్పదంగా జరుగుతున్న ఈ తవ్వకాలపై అటు మీడియా ఫోకస్, ఇటు ప్రజలు గమనిస్తుండటంతో అలెర్ట్ అయిన చంద్రబాబు తవ్వకాలను వీలైనంత సమయం సాగదీసి.. నిధిని కొల్లగొట్టి.. దానిని అక్కడ్నుంచి తరలించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారట. ఈ నేపథ్యంలో గుప్త నిధులను తరలించేందుకు చెన్నంపల్లిలో ఇప్పటికే పోలీసుల బృందం మోహరించిందని గుస గుసలు వినిపిస్తున్నాయి.