ప్రముఖ యాంకర్ ప్రదీప్ న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం సేవించి.. పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ విషయం తెలిసిందే. అయితే, ఈ విషయం కాస్త తెలుసుకున్న తన తల్లి తీవ్ర మనస్థాపానికి గురైందట. టీవీ రంగానికి రాకముందు ప్రదీప్‌కు మద్యం అలవాటు ఉండేది కాదని, ఎప్పుడైతే బుల్లితెరపై అడుగుపెట్టాడో అప్పట్నుంచి ప్రదీప్ కొంచెం.. కొంచెంగా మద్యం సేవించడం మొదలు పెట్టాడని తన సన్నిహితులతో చెప్పిందట. ఆ విషయం గమనించిన తాను మద్యం మహమ్మారిని వదిలిపెట్టమని, ఎన్నో సార్లు మొరపెట్టుకున్నానని, అయినా, నన్ను లెక్కచేయకుండా మద్యం సేవిస్తూనే ఉన్నాడని కన్నీరుమున్నీరైందట.
అయితే, బుల్లితెరపై తనదైన శైలిలో రాణిస్తున్న ప్రదీప్ ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడటంతో తన కుటుంబ సభ్యుల్లో అలజడి నెలకొనడం సహజమే. అంతేగాక ప్రదీప్‌పై తన తల్లి తీవ్ర ఆగ్రహంతో ఉందట. ప్రదీప్ ఈ కేసునుంచి వీలైనంత త్వరగా బయటపడి.. మద్యం మహమ్మారి నుంచి దూరం అయితే బాగుంటుందని ప్రదీప్ అభిమానులు, టీవీ ప్రముఖులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.