నూతన సంవత్సరం వేడుకలకు హైదరాబాద్ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. మోతాదుకు మించి మద్యం సేవించిన వారికి భారీగా జరిమానాలు విధించారు. వేకువ ఝాము వరకూ పోలీసుల డ్రంక్ డ్రైవ్ కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా ఒక ప్రముఖ యాంకర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. తెలుగు టీవీ యాంకర్ ప్రదీప్ మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పోలీసులు పట్టుకన్నాసంగతి తెలిసిందే
అయితే ఆ సమయంలో ప్రదీప్ పక్కన కూర్చున్నది ఒక లేడీ ఆమె ఒక ప్రముఖ యాంకర్ అని సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్చల్ చేస్తుంది. ఆమె గతంలో ప్రదీప్ తోపాటు యాంకర్ గా పని చేసిన అప్ కమింగ్ హీరోయిన్ అనే వార్త వైరల్ అవుతుంది. కాగా అతని పక్కన ఉన్న లేడీ ఎవరని ఆరా తీయగా ఆమె ప్రదీప్ స్నేహితురాలు అని తెలిసింది.
న్యూ ఇయర్ పార్టీలో ప్రదీప్ తోపాటు తన స్నేహితులు, స్నేహితురాళ్ళు పాల్గొన్నారు. పార్టీ అయిపోయాక ఇంటికి చేరదామనే సమయంలో పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా బుక్కయ్యారు ప్రదీప్. అయితే రెండు రోజులుగా ప్రదీప్ పక్కన ఉన్న ఆమె గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుండటం, ఆమె ప్రదీప్ స్నేహితురాలు అవ్వడం చేత ఈ వార్తలకు పులుస్టాప్ పడినట్లయింది.