గడిచిన గత సంవత్సరం 2017 సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబానికి ఎంతో ప్రత్యేకం. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. సమంత, నాగచైతన్య భార్యాభర్తలుగా ఒక్కటి కావడం, అలాగే, నాగార్జున తనయుడు అఖిల్ హలో చిత్రంతో హిట్ కొట్టడం అక్కినేని కుటుంబానికి కలిసొచ్చింది.
అయితే, అఖిల్‌కు శ్రియాభూపాల్‌కు నిశ్చితార్ధం జరిగిన విషయం తెలసిందే. అయితే, నిశ్చితార్థం వరకు వచ్చిందేకానీ.. పెళ్లి కాలేదు. ఈ విషయం నాగార్జునను ఎంతో ఆవేదనకు గురి చేసిందట. ఈ విషయం తను ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే, సమంత, నాగచైతన్యల రూపంలో తమ ఇంటికి సంతోషం వచ్చిందని,సమంత తమ ఇంటికి వచ్చిన వేళా విశేషం ఏమిటోగానీ.. తమకు అంతా మంచే జరుగుతుందని ఆనందం వ్యక్తం చేశాడు నాగార్జున. నాగచైతన్యకు మంచి మనస్సు ఉండబట్టే సమంత లాంటి అమ్మాయి తమ ఇంటికి కోడలిగా వచ్చిందన్నారు.
ఇక అఖిల్ విషయానికొస్తే అఖిల్‌కు స్టార్టింగ్ నుంచే మంచి కెరియర్ ఇద్దామనుకున్నా.. కానీ కుదరలేదు. అయితే, సమంత అడుగుపెట్టిన వేళావిశేషమో ఏమో తెలీదు కానీ.. అఖిల్ నటించిన రెండో చిత్రం హలో హిట్ అయిందని నాగార్జున చెప్పుకొచ్చాడు.
అయితే, మొదటి సినిమా హిట్ కాలేదన్న బాధలో ఉన్న అఖిల్‌లో మనోధైర్యాన్ని నింపింది సమంతనేనట. ఎక్కడో అనాథపిల్లలు బాధల్లో ఉంటే మనస్సు సమంతది. సమంత, నాగచైతన్య కలిసి అఖిల్‌ను మోటివేట్ చేశారన్నారు. అందుకే సమంత తమ కుటుంబం సభ్యులపట్ల తీసుకునే జాగ్రత్తను చూసి సమంతను వదినమ్మ అని పిలుస్తానంటూ చెప్పుకొచ్చాడు అఖిల్.