తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి నివాసంలో ఆయనతో భేటీ అయిన జనసేనాని అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెల్పినట్లు వెల్లడించారు. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చూసి ఆశ్చర్య పోయానని పవన్ కల్యాణ్ అన్నారు. 24 గంటల విద్యుత్ ఎలా సాధ్యం అడిగి తెలుసుకున్నానని పవన్ తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కరెంట్ విషయంలో తనకు చాలా సందేహాలు ఉండేవని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే కరెంటు విషయంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన తీరు కేసీఆర్ తీరు తనకు బాగా నచ్చిందని పవన్ అన్నారు. 24 గంటల కరెంట్ ఇవ్వడాన్ని భారతదేశఃలోనే కేస్ స్టడీ గా చూడొచ్చని పవన్ అన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ నాయకులపై పవన్ ప్రశంసలు గుప్పించారు. తెలంగాణ నేతల స్పూర్తిని చూసి నేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించినప్పుడల్లా ఇదే మాట చెపుతుంటానని పవన్ అన్నారు. టీఆరెస్ నాయకుల మీద గౌరవం ఉంది అని మొదటి నుండి చెపుతున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు.