తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని కుడకుడలో ఆయన కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నారు. గిరిజన బాలుర వసతి గృహంలో విద్యార్థులతో కలిసి మంత్రి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం విద్యార్థులతో మంత్రి కేక్ కట్ చేయించి.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు.
