నూతన సంవత్సరం వేడుకలకు హైదరాబాద్ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. మోతాదుకు మించి మద్యం సేవించిన వారికి భారీగా జరిమానాలు విధించారు. వేకువ ఝాము వరకూ పోలీసుల డ్రంక్ డ్రైవ్ కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా ఒక ప్రముఖ యాంకర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. తెలుగు టీవీ యాంకర్ ప్రదీప్ మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పోలీసులు పట్టుకన్నారు.
సాధారణంగా మద్యం తాగి వాహనం నడుపుతూ బ్రీత్ ఎనలైజ్ టెస్టులో పట్టుబడితే 35 పాయింట్లు దాటితే జైలు శిక్షతో పాటు, వాహనం సీజ్ చేయాలని నిబంధనలు రూపొందించారు. అయితే ప్రదీప్ బ్రీత్ ఎనలైజర్ టెస్టులో 178 పాయింట్లు బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 45 వద్ద ప్రదీప్ కారును ఆపిన పోలీసులు బ్రీత్ ఎనలైజ్ చేయగా 178 పాయింట్లు నమోదు కావడంతో ఆయనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ప్రదీప్ మాత్రం జరిమానా చెల్లించి వెళ్లిపోయారు. కొత్త చట్టం ప్రకారం ప్రదీప్ శిక్ష పడే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు.ఇక మద్యం తాగి వాహనాలు నడపకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా వాహనచోదకుల్లో మాత్రం మార్పు రాలేదు.
అయితే మరోపక్క టీవీ యాంకర్ ప్రదీప్ పక్క సీటులొ అమ్మాయి ఎవరు అనేది బయటపెట్టలేదు… చూపించనులేదు. ప్రదీప్ తో అమ్మాయి తాగింద..లేదా ..ఎక్కడ నుంచి వస్తున్నారు..ఇంకా కారులో ఎంతమంది ఉన్నారో తెలియాల్సింది.