వైసీపీ అదినేత జగన్ పాదయాత్రతో వైసీపీలోకి వలసలు పెరిగిపోతున్నాయి. వైసీపీ నుండి టీడీపీలోకి చేరినా వారు తిరిగి మళ్లీ వైసీపీలోకి చేరుతున్నారు. ఇటీవల మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సమక్షంలో టీడీపీలో చేరిన గుడివాడ మున్సిపల్ వైసీపీ పార్టీ ఫ్లోర్ లీడర్ రవికాంత్ తిరిగి సొంతగూటికి చేరారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి రవికాంత్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతల కుట్రలు, బెదిరింపులను ఆయన మీడియా సమక్షంలో బయట పెట్టారు. త్వరలోనే టీడీపీ నేతలు తనను ఏ విధంగా ప్రలోభపెట్టారో ఆధారాలతో సహా బయటపెడతానని స్పష్టం చేశారు. చంద్రబాబు వైఎస్సార్సీపీ నాయకులను ప్రలోభ పెట్టి రాజకీయం చేస్తే ఇలాంటి సంఘటనలే జరుగుతాయని ఎమ్మెల్యే కొడాలి నాని హెచ్చరించారు.
