యావత్ భారతదేశ సినీ చరిత్రలో ద్విపాత్రాభినయం చేసే హీరోల గురించి మాట్లాడుకునే సమయంలో వారు చేసిన చిత్రాలను వేళ్లమీద లెక్కపెట్టుకోవచ్చు అనడంలో అతిశయోక్తి కాదు. అంతలా మన హీరోలు వారి స్టార్ ఇమేజ్‌ను కాపాడుకోవడం కోసం ద్విపాత్రాభినయం కథలకు దూరంగా ఉన్నారు. అయితే, అది నాటి తరానికి అంటగట్టడం మంచిది కాదంటున్నారు సినీ విశ్లేషకులు. నాడు భారతదేశ సినీ ఇండస్ర్టీలో ద్విపాత్రాభినయం చేసేందుకు హీరోలు వెనుకంజ వేసేవారు కాదట. కానీ, ఈ మధ్య కాలంలో అటువంటి పరిస్థితి లేదు. ద్విపాత్రాభినయం అంటేనే స్టార్ హీరోలు సైతం వెనుకంజ వేస్తున్నారు.
అయితే, నేటి కాలంలో ఆ పరిస్థితి కాస్త మెరుగుపడిందని చెప్పక తప్పదు. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లో కూడా ద్విపాత్రాభినయానికి స్టార్ హీరోలు ముందుకు వస్తున్నారు. అయితే, ద్విపాత్రాభినయానికి డూప్‌లేకుండా నటించే వారిని ఆలోచించకుండా వేళ్లపై లెక్కపెట్ట వచ్చు. అందుకు కారణం.. సినీ ఇండస్ర్టీల్లో కవలలు తక్కువ సంఖ్యలో ఉండటమే.
అందులో ముందుగా చెప్పుకోవాల్సిన వారు రామ్, లక్ష్మణ్, సినీ ఇండస్ర్టీలోకి ఎంట్రీ సమయంలోను, సినిమాల్లో తమ ఫైట్లను హైలెట్ చేసేందుకు వీరు ఎన్నో కష్టాలు పడ్డారని అనేక ఇంటర్వ్యూలో వీరు చెప్పుకున్నారు. అంతేగార వీరు కవల పిల్లల్నే చేసుకోవాలనుకున్నారట. అందుకే మా వివాహం కాస్త ఆలస్యంగా జరిగిందని కూడా చెప్పుకొచ్చారు.
ఇదే కోవకు చెందిన ధర్మ, రక్ష. కవల సోదరులైన వీరు రామ్ గోపాల్‌వర్మ సహా పలు స్టార్ డైరెక్టర్ల వద్ద దర్శకత్వ విలువలు నేర్చుకుని… అదే రంగంలో ఇప్పుడు విజయవంతంగా రాణిస్తున్నారు. వీరు చేసిన తొలి సినిమా చందమామ,
మరొకరు సాయిపల్లవి, పూజ. సినీ ఇండస్ర్టీలో పింపుల్స్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది సాయిపల్లవి. నటించింది నాలుగైదు సినిమాలే అయినా.. స్టార్ ఇమేజ్ ఈ బ్యూటీ సొంతం. తాజాగా నేచురల్ స్టార్ నానితో కలిసి నటించిన ఎంసీఏ మూవీ మాంచి కలెక్షన్స్ రాబడుతూ విజవంతంగా ప్రదర్శింపబడుతోంది. అయితే, సాయిపల్లవి, పూజ అక్కా చెల్లెలు కావడం గమనార్హం. తన తల్లి సాయిభక్తురాలు కాబట్టి.. తన పేరుముందు సాయి అని చేర్చిందని సాయిపల్లవి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.