Home / ANDHRAPRADESH / ఆవ‌లించుకుని.. జీర్ణించుకుని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్నాడ‌ట‌..!!

ఆవ‌లించుకుని.. జీర్ణించుకుని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్నాడ‌ట‌..!!

టీడీపీ నేత‌, ప్ర‌ముఖ సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు వియ్యంకుడు నంద‌మూరి బాల‌కృష్ణ మ‌రోసారి త‌డ‌బ‌డ్డాడు. ఇటీవ‌లే విజ‌య‌వాడ‌లో జ‌రిగిన జ‌య‌సింహా చిత్రం ఆడియో ఫంక్ష‌న్‌లో అల్లుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా ల‌కేష్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన బాల‌కృష్ణ‌.. నిన్న అనంత‌పురం జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడుతూ.. త‌డ‌బ‌డ్డాడు. అస‌లు తాను మాట్లాడుతున్న‌ది.. త‌న‌కైనా అర్థ‌మ‌వుతుందా..? అన్న రీతిలో అన్న మాట‌. ఇదే స‌భ‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గురించి మాట్లాడుతూ.. అయితే, మ‌రీను.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గురించి మాట్లాడుతూ.. త‌న‌కు ఉన్న అనుభ‌వంతో.. మేథా సంప‌త్తితో.. అన్ని కోణాల నుంచి ప‌రిస్థితుల‌ను ఆవ‌లించుకుని.. జీర్ణించుకుని.. ఆర్థిక ప్ర‌మాణాల‌కు స్వీకారం చుట్టి.. రైతుల సంక్షేమం, వారి బాగు కోసం రైతు రుణ‌మాఫీ చేశార‌న్నారు.

అయితే, బాల‌కృష్ణ మాట‌ల‌ను విన్న‌, గ‌మ‌నించిన అక్క‌డి ప్ర‌జ‌లు … చంద్ర‌బాబు ఆవ‌లించుకోవ‌డం ఏంటీ.. జీర్ణించుకోవ‌డ‌మేంటీ.. అంటూ చ‌ర్చించుకున్నారు. బాల‌కృష్ణ మాట‌లు త‌మ‌కేమీ అర్థం కాలేద‌ని త‌మ‌లో తాము గుస‌గుస‌లాడుకున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat