ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించిన సంగతి తెల్సిందే .ఈ బిల్లుపై సర్వత్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు కొన్ని ప్రతిపక్ష పార్టీలు .ఈ క్రమంలో ఎంఐఎం అధినేత ఒవైసీ మాట్లాడుతూ కేవలం ముస్లిం వర్గాలకు చెందినవారే భార్యలను వదిలేస్తున్నారా ..ఇతర వర్గాలకు చెందినవారు వదిలేయడంలేదా ..
ఏకంగా ప్రధాన మంత్రి నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రంలో ఈ సంఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి .అట్లాంటిది అక్కడ ఏమి చేయలేక మోదీ ఇలా చేస్తున్నారు అని విమర్శల పర్వం కురిపించారు .అంతే కాకుండా ప్రధాని మోదీ వదిలేసిన గుజరాత్ రాష్ట్రంలో నా వదిన పరిస్థితి ఏమిటి అని ఏకంగా మోదీ భార్యను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు .
తాజాగా దేశ రాజధాని ఢిల్లీ అధికార పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మహిళ ఎమ్మెల్యే ట్విట్టర్ వేదికగా మోదీపై విమర్శలు వర్షం కురిపించారు .మహిళ ఎమ్మెల్యే ఆల్కా లాంబా అసలు ట్రిపుల్ తలాక్ చెప్పడం ఎందుకు ?.జైలుకు వెళ్ళడం ఎందుకు .అసలేమి చెప్పకుండా పెళ్ళాన్ని వదిలేసి వెళ్తే ఏకంగా దేశానికి ప్రధానిగా అయిపోవచ్చు కదా అని ఆమె సంచలన ట్వీట్ చేశారు ..