వైకుంఠ ఏకాదశి రోజు పార్లమెంట్‌లోని ప్రధాని ఛాంబర్లో ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి భారత ప్రధాని నరేంద్రమోడీని మర్యాదపూర్వకంగా విజయసాయిరెడ్డి కలిశారు.. ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినందుకు మోదీకి అభినందనలు తెలిపారు. అయితే 15 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని పరిస్థితులపైనా ప్రస్తావన వచ్చింది.
ఫాతిమా కాలేజ్ సమస్యని పరిష్కరించాలని , అదే విధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తోపాటు విభజన చట్టంలో ఉన్న విధంగా రాష్ట్రానికి ప్రాజెక్టులు మంజూరు చేయాలని , ఇంకా పోలవరం ప్రాజెక్టు ని త్వరితగతిన పూర్తి చేయాలని విజయసాయిరెడ్డి ప్రధానిని కోరటం జరిగింది .వీటితో పాటుగా రైల్వే జోన్ మరియు రాయలసీమకి స్టీల్ ఫ్యాక్టరీ తోపాటు రాష్ట్రానికి సంభందించిన అనేక సమస్యలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లి అన్నిటినీ త్వరితగతిన పూర్తి చేయాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
వైసీపీ ఇచ్చిన పిర్యాదులను చూడలని..అవి అమలు అయ్యోటట్లు చూడలని వైసీపీ ఎంపీ కొరారు. దీనికి ప్రధాని సానుకులంగా స్పందిచినట్లు సమచారం. ఇంకా ఏపీలో ప్రజా సమస్యల కొసం చేపట్టిన వైఎస్ జగన్ పాదయాత్ర గురించి ప్రధాని మోడీ విజయసాయిరెడ్డి వద్ద ఆరా తీశారు. వైఎస్ జగన్ పాదయాత్ర కు ఏపీ ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. భారీగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు…నేషనల్ మీడియా కూడ చూపిస్తుంది. అంతేగాక సోషల్ మీడియా మొత్తం జగన్ పాదయాత్ర గురించి హల్ చల్ చేస్తున్నాయని విజయసాయితో ప్రధాని మోడీ అన్నారు . ఈ క్రమంలో జగన్ పాదయాత్ర విజయవంతంగా సాగుతోందని విజయసాయిరెడ్డి వివరించారు.