2017 ముగుస్తున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పరిపాలనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనలో ఈ ఏడాది మొత్తం అరాచకాలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు, అబద్ధాలతో సాగుతోందని ధ్వజమెత్తారు. 2017 నారావారి నరకాసురనామ సంవత్సరంగా ఉందని రోజా ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ధైర్యంగా తన మేనిఫెస్టోను చూడగలరా? అని నిలదీశారు. చంద్రబాబు పాలనలో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబుకు మించినవారులేరన్నారు.
అంతేగాక చంద్రబాబు తన మానిపెస్టో ని దైర్యంగా చూసుకోలగరా ,ఈ నాలుగే ళ్ల చంద్రబాబు పాలన అంతా అబద్దాలతో,మోసాలతో సాగుతోందని ఆమె అన్నారు.అందువల్ల ఆయన తన తయారు చేసుకున్న మానిఫెస్టోని కూడా చూడలేని పరిస్థితిలోఉన్నారని ఆమె అన్నారు. పుట్టిన ప్రతి బిడ్డ పేరిట రూ.30 వేలు వేస్తానని అన్నారు.. ఇప్పటి వరకు ఏపీలో ఆడపిల్లలే పుట్టలేదా? అని ఆమె అడిగారు. న్యాయం చేయకపోగా అన్యాయానికి గురైన మహిళలు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళితే వారిని భయపెట్టి వెనక్కు పంపుతున్నారని ఆమె ధ్వజమెత్తారు.