మెగాస్టార్ చిరంజీవి.. అల్లు అర్జున్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. అవును. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఓసారి.. ఓ ఆడియో ఫంక్షన్‌లో మెగా అభిమానులు పవర్ స్టార్.. పవర్ స్టార్ అంటూ గోల చేస్తున్న సమయంలో అదే ఫంక్షన్‌లో పాల్గొన్న అల్లు అర్జున్ పవన్ ఫ్యాన్స్‌పై సీరియస్ అవడంతోపాటు.. వారికి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ గొడవ అక్కడితో ఆగక.. అల్లు అర్జున్ పాల్గొన్న ప్రతీ ఫంక్షన్‌లోనూ రిపీటవుతోంది.
మొన్నటికి మొన్న జరిగిన ఒక్క క్షణం మూవీ ఫ్రీ రిలీజ్ వేడుకలోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. పవన్ అభిమానులు గోల చేయడంతో ఒక్కసారిగా సీరియస్ అయిన బన్నీ.. అలా అరవడం సంస్కారం కాదు.. ఎవరైనా మాట్లాడుతుంటే.. ఎదురు మాట్లాడటం మంచిది కాదు, ఒకరి ఫీలింగ్ చెప్పుకుంటున్నప్పుడు అలా మాట్లాడితే ఎవరైనా బాధపడతారని, ఇకపై అలా చేస్తే అటువంటి ఫ్యాన్స్ హీరో పేరును చెప్పేందుకు కూడా వెనుకాడనని పవన్ అభిమానులను ఉద్దేశించి అన్నాడు.
ఇలా పదే.. పదే.. అభిమానులపై అల్లు అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో మెగాస్టార్ చిరంజీవి.. అల్లు అర్జున్‌పై ఫైరయ్యాడట. వారి జోలికి పోవద్దు అని, వారు అభిమానులు.. సరదాగా ఉంటారు. అంటూ అల్లు అర్జున్‌కి చిరంజీవి క్లాస్ పీకాడట. ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్‌లో జోరుగా వినిపిస్తోంది.