మొన్నటి వరకు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై అన్ని విధాలా సందర్భానుసారంగా విమర్శల దాడి చేస్తూ చివరికి ఆయన అభిమానులను, జనసేన పార్టీని సైతం విడిచిపెట్టకుండా తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చిన సినీ క్రిటిక్ కత్తి మహేష్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌పై మళ్లీ విరుచుకుపడ్డాడు.
అయితే, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కత్తి మహేష్ మాట్లాడుతూ.. నా పర్సనల్ ప్లేస్‌లో.. అంటే నేను ఎక్కడో ఒక బీరు మగ్గు నా చేతిలో ఉన్నప్పుడు ఒక ఫోటో తీసుకుని, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. వీడా మాకు నీతులు చెప్పేది అని టైప్ చేస్తూ వైరల్ చేస్తున్నారని పవన్ ఫ్యాన్స్‌పై మండిపడ్డాడు. నేను తాగుతానా..? తిరుగుతానా..? అన్నది నా ఇష్టం. ప్రశ్నించడానికి మీరెవ్వరంటూ ప్రశ్నించాడు. నా ఫోటోను పబ్లిక్ డొమైన్‌లో పెట్టి.. అందరి చేత తిట్టిస్తున్నాడని మండిపడ్డాడు. ఇప్పటి వరకు మీరందరూ గమనించాల్సిన విషయం… సాధారణంగా నేను ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడలేదని, ఇప్పుడు అలా మాట్లాడేందుకు పవన్ కల్యాణ్ ఫ్యాన్సే నాకు లైసెన్స్ ఇచ్చినట్లుందని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు కత్తి మహేష్.