అమ్మాయి ని ప్రేమ పేరు తో మోసం చేసి నగర శివార్లలో కి తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన పాతబస్తీ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే మొహమ్మద్ నసిర్ బాబా(19 ) విద్యార్థి. పాతబస్తీ రియాసత్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. రెయిన్ బజార్ లోని యకుత్ పురా లో నివాసం ఉండే ఓ మైనర్ అమ్మాయి తో సోషల్ మీడియా లో పరిచయం అయ్యింది.సంవత్సరం పరిచయం కాస్తా ప్రేమ గా మరి ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు నమ్మించాడు యువకుడు. ఈ నెల 26వ తేదీ ఉదయం అమ్మయికి కాల్ చేసి సాయంత్రం మనం పెళ్లి చేసుకుందాం అని మాయమాటలు చెప్పి అమ్మాయిని రంగారెడ్డి జిల్లా కడ్తాల్ గ్రామానికి తీసుకెళ్లి ఓ రూమ్ ని తీసుకొని అమ్మాయిని అర్ధరాత్రి లోబరుచుకున్నాడు.27వ తేదీ ఉదయం అమ్మాయిని యకుత్ పురా రైల్వే స్టేషన్ లో వదిలి పారిపోయాడు.ఇంటికి వెళ్లినబాలిక జరిగిన సంఘటన తల్లి కి చెప్పింది. దింతో తల్లి రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని సంతోష్ నగర్ లొ యువకుడి ని పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.