అందగత్తె ,మాజీ ప్రపంచ సుందరి ఐశ్వరాయ్ కు అభిషేక్ బచ్చన్ కు వివాహమై ఒక కూతురు ఉంది అనే సంగతి తెల్సిందే .అయితే ఐష్ కు కుమార్తె కాదు ఏకంగా కుమారుడు ఉన్నాడు అంట .అంతే కాకుండా ఐష్ ఆ బాబుకు సరిగ్గా పంతొమ్మిది యేండ్ల కింద అంటే 1998లో జన్మనిచ్చింది అంట .తాజాగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూతురినంటూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన అమృత ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీమ్ కోర్టు మెట్లు కూడా ఎక్కారు.
ఇప్పుడు తను ఐష్ కుమారుడిని అంటూ కర్ణాటక రాష్ట్రంలో మంగుళూరుకు చెందిన సంగీత్ రాయ్ అనే యువకుడు అంటున్నాడు .అయితే తన తండ్రి ఎవరు అని అడిగితె మాత్రం జవాబు చెప్పడం లేదు .కానీ ఐష్ కుటుంబ సభ్యులతో భేటీ జరిపిస్తే నిజానిజాలు నిరూపిస్తాను అని ఆయన మీడియా ముందుకు వచ్చినట్లు కర్ణాటక రాష్ట్ర మీడియాలో ,సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి .