ఒకప్పటి పని మనిషి.. ఇప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ను ఆస్వాదిస్తోంది. నాడు తాను పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని పొంది.. బాలీవుడ్ చిత్రాల్లో వరుస అవకాశాలను చేజిక్కించుకుంటూ తన నటనతో సినీ జనాలను ఆకట్టుకుంటోంది. నాడు పనిమనిషిగా పనిచేసిన ఆమె నేడు ఒక హీరోయిన్గా బిందాస్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ.. తన నటన అద్భుతమని ప్రశంసలు అందుకోవడంతోపాటు బాలీవుడ్ స్టార్ హీరోల సరన నటిస్తోంది.
ఇంతకీ ఆమె ఎవరో కాదు.. మహీరాఖాన్. అవును. ఒకసారి ఆమె బాలీవుడ్‌కు ఆరంగ్రేటం కాకముందు తన జీవితాన్ని పరిశీలిస్తే పై విషయాలను ఒప్పుకోక తప్పదు. వారిది ఒక మధ్యతరగతి కుటుంబం, వారి కుటుంబం వారు మహీరాఖాన్ను చదివించేందుకు కూడా ఆసక్తి చూపలేదట. ఇందుకు కారణం పేదరికమే. పై చదువులు చదివేకొద్దీ.. డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందని భయపడి.. చదువు మాన్పించేందుకు యత్నించారట.
అయితే, వాటన్నింటిని లెక్క చేయని మహీరాఖాన్ పార్ట్‌టైమ్ కింద ఇళ్లలో పాచిపనులు చేసుకుంటూ.. దాంతో వచ్చే డబ్బులతో కాలేజీ ఫీజులు కడుతూ.. తన చదువును కొనసాగించిందట. అలా తన జీవితం కొనసాగుతున్న తరుణంలో ఓ డైరెక్టర్ ఆమె రూపాన్ని చూసి.. సినిమాల్లో ఛాన్స్ ఇచ్చాడట. ఇలా సినిమాలో నటించే ఛాన్స్ రావడంతో.. అవకాశాన్ని ఉపయోగించుకున్న మహీరాఖాన్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ను అనుభవిస్తోంది. జీవితంలో కష్టపడితే దానికి ఫలితం తప్పక అందుతుందన్న సామెతకు మహీరాఖాన్ ఉదాహరణగా నిలిచిందంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.