వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పరిణితికి.. 40 ఏళ్ల అనుభవం తలదించుకోవాల్సిందే అన్న మాట వాస్తవమని చెప్పడంలో అతిశయోక్తి కాదు. అయితే, ఈ విషయం ఓ సంస్థ చేసిన సర్వేలో మరోసారి వెల్లడైంది. ఇందుకు గల కారణాలను కూడా ఆ సంస్థ చేసిన సర్వే నివేదిక బహిర్గతం చేసింది.
జగన్ పాదయాత్ర, ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం, ప్రస్తుత రాజకీయ అంశాలపై చేసిన ఈ సర్వేలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. జగన్‌కు రాజకీయాల్లో పరిణితి, జగన్ పాదయాత్ర, ప్రజలు జగన్‌ను ఎందుకు ఆదరిస్తున్నారు..? అన్న అంశాలపై జరిగిన ఈ సర్వేలో ఓ స్పష్టమైన నివదికను కూడా బహిర్గతం చేసింది ఆ సంస్థ.
జగన్ రాజకీయ విలువలకు ఇచ్చే ప్రాధాన్యత, పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు అంశం, వైసీపీలో చేరదలచినవారు పదువులు వదులుకుని.. వైసీపీలోకి రావాలన్న అంశం, అలాగే, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చంద్రబాబు సర్కార్ మంత్రి పదవులు, దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ, విలువలు తగ్గించే రాజకీయాలకు వైసీపీ దూరంగా ఉండటం అంశాలను ప్రజలు ఆలస్యంగా అర్థం చేసుకున్నా.. చివరకు జగన్‌పై ఆదరణ పెరిగేందుకు పై అంశాలన్నీ తోడ్పడ్డాయని ఆ సర్వే తెలిపింది.