ఆవేశంతో చేసే పనులు కొన్ని మనకే చూట్టు కుంటాయి. కనుక మనం కొంచెం ఆలోచించి ఇతరులతో ప్రవర్తించాలి. అది సాదరణ వ్యక్తి అయిన రాజకీయ నాయకుడైన ,సెలబ్రీటి అయిన. అయితే ఓ మహిళ కానిస్టేబుల్ తో దురుసుగా ప్రవర్తించబోయి.. చెంప దెబ్బ తిన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆశాకుమారి. సమీక్ష సమావేశం కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు షిమ్లాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్యాయలం దగ్గరకు ఆశాకుమారి చేరుకున్నారు. అయితే ఎక్కువ రద్ది ఉండడం వల్ల పోలీస్ సిబ్బంది ఎమ్మెల్యే ఆశాకుమారిను లోపలికి అనుమతించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె వాగ్వాదానికి దిగి..ఆవేశంతో ఓ మహిళా కానిస్టేబుల్ చెంప పగలకొట్టారు. అయితే దానికి ప్రతిగా ఆ కానిస్టేబుల్ కూడా ఆమె చెంప వాయించింది. ఆపై ఆశాకుమారి ఆగ్రహంతో ఊగిపోగా.. కార్యకర్తలు ఆమెను పక్కకు తీసుకెళ్లారు.