తెలంగాణ రాష్ట్రంలో కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాలు ,విద్యాశాఖ గురుకులాలు ,మోడల్ స్కూల్ హాస్టళ్ళలో చదువుకునే బాలికలకు నిత్యావసర కిట్లను అందజేయాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది .అందులో భాగంగా వారికవసరమై వాటితో పాటుగా సబ్బులు ,ఆయిల్ ,బొట్టు,డేటాల్ ,దువ్వెన,పౌడర్ వంటి ఇలా పలురకాల నిత్యావసర వస్తువులున్న కిట్లను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది .
మొత్తం మూడు నెలలకు సరిపడా ఈ కిట్లను రూ.రెండు వందల తొంబై తొమ్మిది లతో కొనుగోలు చేసింది .అయితే ఈ కిట్లను జనవరి ఒకటో తారిఖు నుండి అందజేయాలని విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది .ఈ మొత్తం ప్రక్రియను జనవరి 26వ తారిఖు లోపు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది .నాలుగు వందల డెబ్బై ఐదు కేజీబీవీల్లోని నలబై ఏడు వేల ఐదు వందల మంది ,ముప్పై ఏడు విద్యాశాఖ గురుకులాల్లో పది వేల మూడు వందల అరవై మంది ,నూట ముప్పై ఆరు మోడల్ స్కూల్లో పద్నాలుగు వేల మంది బాలికలకు వీటిని అందజేయనున్నారు .