టాలీవుడ్ ఇండస్ట్రీ మాటల మాంత్రికుడు ,ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనసత్వం ఉన్న వ్యక్తి అని ఆయన గురించి తెల్సిన ప్రతి ఒక్కరు అనే మాట .ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో త్రివిక్రమ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పంజాగుట్ట దగ్గరలో ఉన్న సాయి బాబా ఆలయం దగ్గర ఉన్న ఒక రూమ్ లో అద్దెకు ఉండేవాడు .
అప్పట్లో ప్రస్తుత హీరో అప్పట్లో కమెడియన్ సునీల్ ,ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తో కల్సి ఉండేవాడు అనే విషయం విదితమే .అయితే అక్కడ ఉంటున్న సమయంలోనే త్రివిక్రమ్ ఇండస్ట్రీలో ఎన్నో కథలను రాశాడు .
ఎన్నో సినిమాలకు మాటలు రాశాడు .దీంతో ఇండస్ట్రీలో ఆ సినిమాలన్నీ బ్లాక్ బాస్టర్ హిట్లుగా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేవి .అప్పటి నుండి వెనక్కి తిరిగి చూడకుండా టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు .అంతకు ఎదిగిన కానీ తనకు కెరీర్ లో మంచి లైఫ్ రావడానికి కారణమైన ఆ రూమ్ ను వదిలిపెట్టకుండా ఇప్పటికి రెంట్ చేల్లిస్తున్నాడు .రెంట్ ఎంతో తెలుసా అక్షరాల ఐదు వేల రూపాయలు .అంత సెంట్ మెంట్ మరి త్రివిక్రమ్ కి ఆ రూమ్ అంటే ..