ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర నేడు అనంతపురం జిల్లా నుంచి చిత్తూరు జిల్లాలో 46వ రోజు ముగిసింది. శుక్రవారం సీబీఐ కోర్టు విచారణకు ఆయన హాజరుకానున్నారు. జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా టీడీపీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. సంకల్ప యాత్ర గురువారం 200 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇందులో పెద్దమండ్యం మండలం దిగువపల్లె, మందలవారిపల్లెకు చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు, మాజీ సర్పంచ్‌లు రెడ్డెప్పరెడ్డి, చంద్రానాయక్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరరెడ్డి, రమణారెడ్డి, రంగానాయక్, మూడేనాయక్, శివ, మల్లేనాయక్, శంకర్, జయానాయక్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పాదయాత్ర ముగిసే సమయానికి ఇంకా వైసీపీలోకి చేరికలు జరుగుతాయని వైసీపీ నాయకులు అంటున్నారు.
