దేశ రాజధాని డిల్లీలోని పాలం ప్రాంతంలో దారుణం జరిగింది.. ఇద్దరు మైనర్ బాలికలపై 60 ఏళ్ల వృద్దుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు . తన ఇంటి పక్కనే ఆడుకుంటున్నఇద్దరు (ఒకరికి ఐదు , మరొకరికి తొమ్మిది సంవత్సరాల వయస్సు వున్నా ) చిన్నారులకు స్వీట్లు ఆశ చూపి వారిని ఇంటిలోకి పిలిచి వారిపై హత్యాచారం చేశాడు.ఈ విషయం ఎవ్వరికీ చెప్పకుండా ఉండేందుకు 5 రూపాయలు ఇచ్చాడు.. అయితే బాలికలు ఏడుస్తూ జరిగిన సంగటన ను వారి తల్లిదండ్రులకు చెప్పారు.వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి బాలికలకు కౌన్సెలింగ్ ఇచ్చినట్టు డీసీపీ మిలింద్ మహదేవ్ చెప్పారు.
