ఆయన ప్రముఖ స్టార్ హీరో .అంతకు మించి ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి మిత్రుడు.గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ అధికారానికి దూరం కావడానికి ప్రధానమైన జనసేన పార్టీ అధినేత .ఇంతకూ ఎవరు ఆయన అని ఆలోచిస్తున్నారా ..ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .అయితే అంతటి ఆదరణ ఉన్న ఆయన్ని కేంద్రం పక్కన పెట్టింది .అంతే కాదు ఆయన రాసిన లేఖను చెత్తబుట్టలో చిత్తు కాగితాల మాదిరిగా పక్కన పడేశారు .ఇంతకు విషయం ఏమిటి అంటే రాష్ట్రంలో విశాఖపట్టణంలో డీసీఐ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు పవన్ అక్కడకి వెళ్లి మరి సంఘీభావం ప్రకటించారు .అంతే కాకుండా ప్రయివేటీ కరణను ఆపాలని ఆ వేదిక నుండే కేంద్రానికి లేఖ రాశారు కూడా .అయితే కేంద్రం మాత్రం గత నెలన్నర రోజులుగా ధర్నాలు ,నిరసనలు చేస్తున్న కానీ పట్టించుకోకుండా ఆ నిర్ణయంపై వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదని తేల్చి చెప్పడమే కాకుండా పవన్ రాసిన లేఖను చెత్తబుట్టలో పడేశారు అని ఒక ప్రముఖ జాతీయ మీడియా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది .అయితే పవన్ రాసిన లేఖకు దిక్కు లేనప్పుడు సమస్యలో ఉన్న తమకు ఎవరు దిక్కు అని డీసీఐ బాధితులు వాపోతున్నారు .
