జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో పవర్ స్టార్‌కు సంబంధించిన ఒక వార్త ట్రెండ్ అవుతోంది. అదే పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల విషయం. ఇప్పటికే ముగ్గురిని పెళ్లిళ్లు చేసుకున్న పవర్ స్టార్ అందులో మొదటి భార్య నందిని, రెండో భార్య రేణుదేశాయ్ కాగా,, వారిద్దరికీ పవన్ కల్యాణ్ అధికారికంగా విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ కల్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవా.
అయితే, పవన్‌పై ఉన్న వ్యక్తిగత కక్షో.. లేక పవన్‌ను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనో కొందరు అనధికారికంగా సోషల్ మీడియాలో రాతలు రాస్తున్నారు. పవన్ పెళ్లిళ్ల గురించి.. ఇంకా అతని వ్యక్తిగత విషయాల గురించి చర్చించేలా సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే వెలుగు చూసిన ఓ పోస్ట్ పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఓ వ్యక్తి పవన్ గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఓ పోస్ట్ చేశారు. అందులో పవన్ కల్యాణ్ చిత్రంతోపాటు రేణుదేశాయ్ ఫోటో ఉంచాడు.. అందులో రేణుదేశాయ్ మాటలుగా.. రాస్తూ.. అవును పవన్ కల్యాణ్ మూడే కాదు. 40 పెళ్లిళ్లు సుకుంటాడు మీకెందుకు అన్నట్లు ఆ ఫోటోలో రేణుదేశాయ్ కామెంట్ చేస్తున్నట్లు ఉంది. ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. దీనిపై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.