లీడర్ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైన రిచా గంగోపాధ్యాయ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన.. టాలీవుడ్‌పై సంచలన కామెంట్స్ చేసింది. అయితే, ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో మహిళా నటులపై జరుగుతున్న దాడుల గురించి పలువురు మీడియా ముఖంగా స్పందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రిచా గంగోపాథ్యాయ మాట్లాడుతూ..
బెడ్‌మీదకు రమ్మని తనను ఎవరూ పిలవలేదని, మనం మన మనసుతోపాటు.. మాటల్లో కూడా గట్టిగా ఉంటేనే అటువంటి కామాంధులు మన జోలికి రాకుండా ఉంటారని మహిళా నటులకు సూచించింది. కేవలం ఒక్క సినిమారంగంలోనే కాకుండా.. మిగతా రంగాల్లో కూడా మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రిచాగంగోపాధ్యాయ.