ఏపీ రాజకీయ చరిత్రలో ఈ సంవత్సరం జరిగిన నంద్యాల ఉప ఎన్నిక ఓ సంచలనం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ నాయకత్వంలో వైసీపీ టికెట్‌పై గెలిచి ఆ తరువాత జరిగిన పరిణామాల దృష్ట్యా టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి మృతి చెందడంతో జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్‌సీపీని ఎదుర్కొనేందుకు చంద్రబాబు సర్కార్ పన్నని కుట్రలు, కుతంత్రాలకు లెక్కలేదని చెప్పడం అతిశయోక్తి కాదు. నిజానికి సాధారణ ఎన్నికల్లో నంద్యాల సీటు వైసీపీదే అయినా.. గెలిచిన అభ్యర్థి టీడీపీలో చేరడంతో.. భూమా నాగిరెడ్డి మరణానంతరం జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ పోటీ చేసిన విషయం విధితమే.
అయితే, ఇక్కడ చెప్పుకోవాల్సిన ప్రధాన విషయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ మంత్రులు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తల గురించి. ఎందుకంటే.. నంద్యాల ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షం బలాన్ని అంచనా వేసిన టీడీపీ ఎమ్మెల్యే సీటును కైవసం చేసుకునేందుకు అడ్డదారిలో తన అధికార బలాన్ని ఉపయోగించడంతోపాటు.. . వైసీపీ నాయకులను, కార్యకర్తలను, ప్రజలను ప్రలోభాలకు గురి చేసింది. అంతేగాక ఏకంగా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను, ఎంపీలను నంద్యాలలో మకాం వేసేలా చేశారు చంద్రబాబు. ఇలా నంద్యాల ఎమ్మెల్యే సీటును తన కుఠిల రాజకీయ అనుభవంతోపాటు.. ప్రలోభాలు, మంత్రులు, ఎంపీల మకాం వేయించి.. రోజుకో వర్గంతో బేరసారాలు జరిపి.. కైవసం చేసుకున్నారు చంద్రబాబు.
అయితే, నాడు ఉప ఎన్నిక సమయంలో నంద్యాలలో ఏ వీధి చూసినా.. ఏ ఇంట చూసినా దర్శనమిచ్చిన ఏపీ మంత్రులు, ఎంపీల గురించి ప్రజలు నేడు చర్చించుకుంటున్నారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు రోడ్లు, అందుబాటులో తాగునీరు, అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్, అలాగే, చంద్రబాబు సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఇళ్ల నిర్మాణం, ఇలా అనేక హామీలు గుప్పించారని, అయితే, ఉప ఎన్నిక తరువాత హామాలు ఇచ్చిన వారితోపాటు.. వారి హామీలు కూడా కనుమరుగయ్యాయని వాపోతున్నారు. నాడు నమ్మి టీడీపీకి ఓట్లు వేస్తే.. ఇలా మోసం చేస్తారా అంటూ చంద్రబాబు సర్కార్‌పై పెదవి విరుస్తున్నారు నంద్యాల ప్రజలు. అంతేగాక 2019లో వైసీపీని గెలిపించి చూపిస్తాం అని నంద్యాల ప్రజలు అంటున్నారు.